భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేవలు! 1 m ago
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో ప్రారంభం కానుంది. డేటా భద్రత మరియు నిల్వ విషయంలో భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు కంపెనీ అంగీకరించింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్సులు పొందే దిశగా ఇది కీలక అడుగు. స్టార్‌లింక్ భారత నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందం త్వరలో సమర్పించాల్సి ఉంది.